![]() |
![]() |

శేఖర్ మాష్టర్ ఇప్పుడు బుల్లితెర మీద స్టార్ కొరియోగ్రాఫర్...ఆయన రకరకాల ఈవెంట్స్ తో ఫుల్ బిజీ ఐపోయాడు. స్టార్ హీరోల మూవీస్ కి కొరియోగ్రాఫర్‌గా చేస్తూ బుల్లితెర మీద ఢీకి జడ్జిగా చేస్తున్నాడు. అలాంటి శేఖర్ మాష్టర్ ఢీ షో మధ్యలోంచి లేచి వెళ్లిపోయాడు.
ఢీ షో కొత్త సీజన్ మొదలైన విషయం తెలిసిందే. సెలెబ్రిటీ స్పెషల్ వస్తున్న ఈ షోలో ఎంతోమంది సెలెబ్స్ స్టెప్పులేస్తున్నారు. సీరియల్ తారలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు కూడా ఢీ షోలో కనిపించనున్నారు. యాంకర్‌గా నందు వచ్చేశాడు. జడ్జ్‌గా ప్రణీత కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి యాంకర్ శివను తీసుకొచ్చారు ఈ షో మేకర్స్. సెలబ్రెటీల ఇంటర్వ్యూలతో వాళ్ళను అడిగే సిల్లీ క్వశ్చన్స్ తో అతను బాగా ఫేమస్ అయిపోయాడు. ఇక ఇప్పుడు తన పైత్యాన్ని ఈ స్టేజి మీద ప్రదర్శించాడు. " మీకు ఒక హీరోయిన్ కి అఫైర్ ఉందని బయట రూమర్స్ నడుస్తున్నాయి మాష్టర్ ?" అని స్టేజ్ మీదే అందరి ముందే శేఖర్ మాస్టర్‌ను అడిగేసరికి శేఖర్ మాష్టర్ ఫుల్ ఫైర్ ఐపోయి " ఎవడ్రా వీడ్ని తీసుకొచ్చింది.." అని అడిగాడు. "మాష్టర్, మాష్టర్ " అని శివ ఏదో చెప్పబోతున్నంతలో "నోరుమూసుకుని ఉండు..నాకు ఒక ఫామిలీ ఉంది..పిల్లలున్నారు. అతన్ని పంపిస్తారా నన్ను వెళ్ళిపోమంటారా" అని సీరియస్ గా అడిగేసి లేచి స్టేజి మీద నుంచి వెళ్లిపోయారు. ఇలా ప్రోమోను కట్ చేశారు. దీంతో సెట్లోని వారంతా షాక్ అయ్యారు అసలక్కడ ఎం జరుగుతుందో అర్ధం కానీ మరో జడ్జ్ ప్రణతి కూడా షాక్ లో ఉండిపోయింది . మరి ఇక ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే.. డిసెంబర్ 27న ప్రసారం అయ్యే ఎపిసోడ్ ను చూడాల్సిందే.
![]() |
![]() |